: ముస్లింల ఓట్లు పడవనే టీడీపీ మమ్మల్ని ప్రచారానికి పిలవడం లేదు!: బీజేపీ


నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారానికి తన మిత్రపక్షమైన బీజేపీని టీడీపీ పక్కన పెట్టేసింది. ముస్లింల జనాభా అధికంగా ఉండే నంద్యాల నియోజకవర్గంలో వారి ఓట్లు పడవనే భయంతో... టీడీపీ తమను ప్రచారానికి పిలవలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముస్లిం ఓట్లు దూరమవుతాయనే భయంతోనే టీడీపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

ఇరు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ తమను దూరం పెట్టేశారని అన్నారు. ఇప్పటికైనా తమను రమ్మని పిలిస్తే, నంద్యాలకు వెళ్లి ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అయితే, ఇరు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోందని... ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఈ సమావేశానికి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News