: స్పెయిన్ కు సరికొత్త సమస్య.. పోటెత్తుతున్న ఆఫ్రికా శరణార్థులు!
ఆఫ్రికా నుంచి పోటెత్తుతున్న శరణార్థులతో యూరోపియన్ దేశం స్పెయిన్ సరికొత్త సమస్యలను ఎదుర్కొంటోంది. గత 24 గంటల్లోనే మొరాకో నుంచి 600 మంది శరణార్థులు స్పెయిన్ కు వలస వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వేల మంది శరణార్థులు స్పెయిన్ లో అడుగుపెట్టినట్టు అంచనా వేస్తున్నారు. జీబ్రాల్టర్ జలసంధి మార్గం ద్వారా వీరు యూరప్ లోకి ప్రవేశిస్తున్నారు. స్పెయిన్ కు పెరుగుతున్న వలసదారుల సంఖ్యను చూస్తుంటే... త్వరలోనే గ్రీస్ ను స్పెయిన్ దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, తాజాగా 15 వెసల్ బోట్లలో వస్తున్న వలసదారులను కోస్ట్ గార్డులు పట్టుకున్నారు.