: మరోసారి అభిమాని చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ... నంద్యాలలో ఘటన... వీడియో చూడండి!


నిన్న రాత్రి తన అభిమాన హీరో బాలకృష్ణకు దండవేసి ఫోటో దిగాలని భావించిన ఓ యువకుడు బాలయ్య ఆగ్రహానికి గురికాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నంద్యాలలో తొలి రోజు రోడ్ షోను ముగించుకున్న ఆయన, రాత్రి బస చేసేందుకు ఓ హోటల్ వద్దకు వచ్చిన వేళ ఈ ఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్యకర్త పెద్ద దండ తీసుకుని దాన్ని బాలయ్యకు అలంకరించేందుకు ప్రయత్నించగా, ఏం జరిగిందో ఏమో... బాలయ్య లాగి పెట్టి ఒక్కటిచ్చారు. ఆ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. బాలయ్య కోపానికి కారణం తెలియరాలేదు. కాగా, ఇటీవల తన అసిస్టెంట్ ను బాలయ్య కొట్టిన వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News