: కలల నుంచి పుట్టిన టెర్మినేటర్, అవతార్ కథలు!: జేమ్స్ కేమరాన్


'టెర్మినేటర్' సినిమా ఆర్నాల్ట్ ష్క్వార్జ్ నెగ్గర్ కు హాలీవుడ్ లో సూపర్ స్టార్ హోదాను తెచ్చింది. 'అవతార్' శామ్ వర్తింగ్టన్ కు స్టార్ హోదా ఇచ్చింది. ఈ రెండు సినిమాల్లో హీరో పాత్రలు భూమికి సంబంధించని, అతీంద్రియ శక్తులు కలిగిన పాత్రలన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించాయి. అయితే ఈ పాత్రల రూపకల్పన వెనుక నిజమైన 'కలలు' ఉన్నాయని ఆ సినిమాల రూపకర్త జేమ్స్ కేమరాన్ తెలిపారు.

ఒక రోజు రాత్రి ఎర్రని మంటల్లో అస్థిపంజరం కాలుతున్నట్టు కల వచ్చిందని ఆయన చెప్పారు. ఆ కల తన బుర్రను వదల్లేదని, దాని స్పూర్తిగా కధను డెవలెప్ చేసి 'టెర్మినేటర్' సినిమా రూపొందించానని ఆయన అన్నారు. 'అవతార్' కథకు కూడా అలాంటి నేపథ్యమే ఉందని ఆయన తెలిపారు. 'అవతార్' కథకు మాత్రం తన కాలేజీ రోజుల్లోనే బీజం పడిందని ఆయన తెలిపారు. తన కలల్లో దట్టమైన అడవులు వస్తుండేవని ఆయన చెప్పారు. వాటినే తాను 'అవతార్' లో చూపించానని ఆయన చెప్పారు. ఈ సినిమాకు నాలుగు సీక్వెల్స్ రూపొందించే పనిలో ఆయన పడ్డారు. 

  • Loading...

More Telugu News