: చంద్రబాబుతో గంగుల భేటీతో అలిగిన మంత్రి అఖిలప్రియ?
ఆళ్లగడ్డ ప్రాంతంలో భూమా నాగిరెడ్డి కుటుంబానికి ప్రధాన ప్రత్యర్థి వర్గమైన గంగుల కుటుంబంలోని కీలక నేత ప్రతాప్ రెడ్డి, నిన్న చంద్రబాబును కలవడం, ఆయన టీడీపీలో చేరనున్నారని వచ్చిన వార్తలతో మంత్రి అఖిలప్రియ అలక బూనినట్టు తెలుస్తోంది. నిన్న నంద్యాల ఉప ఎన్నికల్లో హీరో బాలకృష్ణతో కలసి ప్రచారంలో పాల్గొన్న ఆమె, గంగుల, చంద్రబాబు భేటీ విషయం తెలియగానే, ప్రచారం నుంచి వెళ్లిపోయి, తన అనుచరులతో భేటీ అయినట్టు సమాచారం.
తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా గంగుల ప్రతాప్ రెడ్డిని ఎలా చేర్చుకుంటారని ఆమె ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ ను గంగులకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు వచ్చిన వార్తలతో భూమా వర్గంలో ఆగ్రహం వ్యక్తమైనట్టు తెలిసింది. ఆళ్లగడ్డ ప్రాంతంలో భూమా, గంగుల వర్గాల మధ్య ఎన్నో ఏళ్లుగా వర్గపోరు నడుస్తున్న విషయం విదితమే.