: సీఎం పళనిస్వామి రాజీనామా చేయాల్సిందే.. మరోసారి విరుచుకుపడిన కమలహాసన్!


తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ మరోమారు విరుచుకుపడ్డారు. ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పళని ప్రభుత్వంలో రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆరోపించిన ఆయన ఇంత జరుగుతున్నా ఏ ఒక్క పార్టీ కూడా పళని రాజీనామాకు డిమాండ్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందని ట్వీట్ చేశారు. మరింత మెరుగైన తమిళనాడే తన లక్ష్యమని పేర్కొన్నారు. తన గొంతును బలపరిచేదెవరని మరో ట్వీట్‌లో ప్రశ్నించారు.  కమల్ ట్వీట్లపై తమిళ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ, అన్నాడీఎంకే ఎంబీ అన్వహర్ రాజాహా  స్పందించారు. కమల్ ప్రకటనలు సినిమా స్టైల్‌లో ఉన్నాయని విమర్శించారు. ఆయన శత్రుత్వ భావనతో రగిలిపోతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News