: ఖాతాదారులకు షాకిచ్చిన మరో బ్యాంకు.. వడ్డీ తగ్గించిన ప్రైవేటు రంగ సంస్థ!
ప్రభుత్వ రంగ బ్యాంకుల బాటలో ప్రైవేటు బ్యాంకులు నడుస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు వడ్డీని తగ్గించిన కొన్ని రోజులకే ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా వడ్డీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా 'ఎస్' బ్యాంకు లక్ష రూపాయలలోపు డిపాజిట్లపై వడ్డీని ఐదు శాతానికి పరిమితం చేసింది. రూ. లక్ష నుంచి రూ.కోటి వరకు 6 శాతం వడ్డీ కొనసాగుతుందని పేర్కొంది. కోటి రూపాయల పైబడిన డిపాజిట్లను 6.25 శాతానికి తగ్గించినట్టు ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి తగ్గించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.