: మెడికల్ కాలేజీ తరలింపుకు నిరసనగా.. నేడు జగ్గారెడ్డి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం!
సంగారెడ్డి నుంచి మెడికల్ కాలేజీని తరలించడంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష నేడు చేపట్టనున్నారు. ప్రభుత్వం, మంత్రి హరీష్ రావు నిర్లక్ష్యం వల్లే సంగారెడ్డి నుంచి మెడికల్ కాలేజీ సిద్ధిపేటకు తరలిపోయిందని ఆయన ఆరోపించారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని, మెడికల్ సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆయన నేటి ఉదయం పది గంటలకు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తన నిరాహార దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆయన నిర్ణయంపై టీఆర్ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్ కోసమే జగ్గారెడ్డి నిరాహార దీక్ష డ్రామా ఆడుతున్నాడని టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.