: జియో రీచార్జ్.. ఆఫర్ల వాన కురిపిస్తున్న పేమెంట్ పోర్టళ్లు.. వివరాలు ఇవిగో!


రిలయన్స్ జియో వినియోగదారులు రీచార్జ్ బాట పడుతుండడంతో పేమెంట్ పోర్టళ్లు ముందుకొచ్చాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి. ఫలితంగా వినియోదారులకు బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. జియో రీచార్జ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఏయే సంస్థలు ఎటువంటి ఆఫర్‌ను ప్రకటించాయంటే..

పేటీఎంలో రూ.300 అంతకంటే ఎక్కువ మొత్తంలో రీచార్జ్ చేసుకుంటే రూ.76 క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అయితే ఇందుకోసం ‘పేటీఎంజియో’ ప్రోమో కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రీచార్జ్ చేసుకున్న 24 గంటల తర్వాత క్యాష్‌బ్యాక్ పేటీఎం వ్యాలెట్‌లో జమ అవుతుంది. ఫోన్‌పే ద్వారా అయితే ఎటువంటి ప్రోమో కోడ్ ఉపయోగించకుండానే రూ.300 ఆపై మొత్తాలలోని రీచార్జ్‌లపై రూ.75  క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈనెల 21 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

మొబిక్విక్‌లో ‘జియోఎంబీకే’ ప్రోమో కోడ్‌తో రూ.399 రీచార్జ్ చేసుకుంటే రూ.59 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. మొబిక్విక్‌లో తొలిసారి రీచార్జ్ చేసుకుంటున్నవారు ‘న్యూజియో’ కోడ్‌ను ఉపయోగించడం ద్వారా రూ.159 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అమెజాన్ పే అయితే రూ.99 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఈనెల 19 వరకే ఉండగా ఆ తర్వాతి రీచార్జ్‌లపై నవంబరు 30 వరకు రూ.20 చొప్పున వినియోగదారులు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

 
 
 
 

  • Loading...

More Telugu News