: అందగాడు కాకపోయినా.. పొడగరి అయివుండాలి!: తన కాబోయే వాడి గురించి రకుల్ ప్రీత్ సింగ్


తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. తనకు కాబోయే వాడు మంచి అందగాడై ఉండకపోయినా, పొడగరి అయి ఉండాలని మాత్రం చెప్పింది. వీటన్నింటి కంటే ముఖ్యంగా, మంచి వాడై ఉండాలని చెప్పిన రకుల్, ఒక వ్యక్తి మంచి, చెడులను వెంటనే తెలుసుకోలేమని అంది. అందుకని, కొన్నాళ్ల పాటు కలసిమెలసి ఉండటం ద్వారా అతని ప్రవర్తనను తెలుసుకుని, ఆ వ్యక్తి నచ్చితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాగా, ప్రస్తుతం ‘స్పైడర్’లో మహేశ్ బాబు సరసన నటిస్తున్న రకుల్, తమిళ చిత్రాల్లో బిజీగా ఉంది.
 

  • Loading...

More Telugu News