: సోనియా గాంధీ కనిపించడం లేదంటూ వాల్ పోస్టర్లు!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, రాయ్ బరేలి ఎంపీ సోనియా గాంధీపై ఆమె సొంత నియోజకవర్గ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టనష్టాలు, సమస్యలు చెప్పుకుందామంటే తమ నేత కనిపించడం లేదంటూ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ కనిపించడం లేదంటూ నియోజకవర్గ వ్యాప్తంగా వాల్ పోస్టర్లు, ప్రకటనలు అంటించారు. సోనియా ఆచూకీ చెప్పిన వారికి బహుమతులిస్తామంటూ ప్రకటించడం గమనార్హం.