: సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు కోల్పోయిన ప్రొఫెసర్.. వంద అడుగుల లోతులో ఉన్న జలపాతంలో పడ్డ వైనం
సెల్ఫీల పిచ్చి యువతకే కాదు పెద్దవారికి కూడా గట్టిగానే పట్టుకుంది. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవద్దని విద్యార్థులకు చెప్పాల్సిన ప్రొఫెసరే అటువంటి పనిచేసి ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడు వానియంబాడి తాలుకాలో చోటు చేసుకుంది. వీరణమలై వాటర్ ఫాల్స్ జలపాతం వద్ద హాయిగా స్నానం చేస్తోన్న ప్రొఫెసర్ అరుల్‌కుమార్ (33) అదే సమయంలో సెల్ఫీ తీసుకుంటూ కిందకు జారి పడ్డాడు. ఆయన కాలు జారి వంద అడుగుల లోతులో ఉన్న జలపాతంలో పడి, మరణించాడని అతడి స్నేహితులు చెప్పారు. ఆయన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు.