: అమరావతి నిర్మాణానికి చంద్రబాబు కష్టపడుతున్నారంటూ కేంద్ర మంత్రి ప్రశంసలు


అమరావతి పరిధిలోని ఎర్రబాలెంలో రూ.1600 కోట్లతో నిర్మించనున్న ఇండో-యూకే హెల్త్ మెడిసిటీకి సీఎం చంద్రబాబు ఈరోజు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అనుప్రియాపటేల్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం, ఏపీ అసెంబ్లీ, సచివాలయాలను చూసేందుకు అనుప్రియ వెళ్లారు. సచివాలయంలోని పలు విభాగాలను మంత్రి నారాయణ ఆమెకు చూపించారు. అనంతరం, అనుప్రియ మాట్లాడుతూ, ఏపీలో ఈ-గవర్నెన్స్ అద్భుతంగా ఉందని, దీని ద్వారా కుటుంబ సంక్షేమ పథకాలపై పర్యవేక్షణ చాలా బాగుందని ప్రశంసించారు. ముఖ్యంగా, కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటు బాగుందని, రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News