: చివరి ఓవర్లో ఏకంగా 40 పరుగులు పిండుకుని... విజయ దుందుభి మోగించారు!


ఆ క్రికెట్ మ్యాచ్‌లో ఇంకా మిగిలి ఉంది ఒక్క ఓవ‌ర్‌ మాత్రమే.. 240 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆరు బంతుల్లో ఇంకా 35 ప‌రుగులు చేయాల్సి ఉంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఇక త‌మదే విజ‌యం అనుకుని సంబ‌రం చేసుకోవ‌డానికి రెడీ అయిపోయింది. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొడితే కానీ విజ‌యం ద‌క్క‌దు. అయితే, అనూహ్యంగా ఆ జ‌ట్టుకి ఆ చివ‌రిఓవ‌ర్లో ఏకంగా 40 ప‌రుగులు వ‌చ్చాయి. ఆక్స్‌ఫర్డ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ఓ క్లబ్‌ మ్యాచ్‌లో భాగంగా స్విన్‌బ్రూక్‌-డార్కెస్టర్‌ మధ్య మ్యాచ్‌ నిర్వహించగా ఈ అరుదైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది.

స్విన్‌బ్రూక్ జ‌ట్టు నిర్ణీత ఓవర్లలో 239 పరుగులు చేసి ఇచ్చిన ల‌క్ష్యాన్ని డార్కెస్ట‌ర్ జ‌ట్టు చివ‌రి ఓవ‌ర్లో ఇలా 40 ప‌రుగులు బాది గెలిచేసింది. చివ‌రి ఓవ‌ర్ల‌లో మొదటి బంతి నోబాల్‌, సిక్స్ వెళ్లింది. దీంతో మ‌రోసారి వేసిన‌ మొదటి బంతికి బ్యాట్స్‌మెన్ మ‌రో సిక్స్‌ బాదాడు. రెండో బంతి డాట్‌ బాల్‌, మూడో బంతి ఫోర్ వెళ్లింది. ఇక నాలుగో బంతి నో బాల్‌, ఫోర్ వెళ్లింది. దీంతో మ‌రోసారి వేసిన నాలుగో బంతిని బ్యాట్స్‌మెన్‌ సిక్స్‌గా మ‌లిచాడు. ఐదో బంతికి మ‌రో సిక్స్ కొట్టాడు. మిగిలిన ఆరో బంతిని కూడా సిక్స్ గా మ‌ల‌చ‌డంతో హ్యాట్రిక్ సిక్స్‌లు సాధించాడు. దీంతో ఒకే ఓవ‌ర్‌లో ఆ జ‌ట్టు 40 ప‌రుగులు రాబ‌ట్టింది. 

  • Loading...

More Telugu News