: ఇందిరా క్యాంటీన్ అనబోయి ‘అమ్మ’ క్యాంటీన్ అనేసి నాలుక్కరుచుకున్న రాహుల్ గాంధీ
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు బెంగళూరులో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జయనగర్ ప్రాంతంలో ‘ఇందిర క్యాంటీన్స్’ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ నోరుజారి నాలుక్కరుచుకున్నారు. రాహుల్ మాట్లాడుతూ ఇందిర క్యాంటీన్స్‌కి బదులు అమ్మ క్యాంటీన్స్ అని పలికారు. గతంలో తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలిసారి ‘అమ్మ క్యాంటీన్లు’ ప్రారంభించి, రూ.5 కే భోజనం అందించిన విషయం తెలిసిందే. రాహుల్ కి ఆ విషయం బాగా గుర్తుండి పోయిందేమో. ‘మరి కొన్ని రోజుల్లో రాష్ట్రంలోని అన్ని నగరాల్లో పేదలు అమ్మ క్యాంటీన్‌లలో.. కాదు ఇందిర క్యాంటీన్స్‌లో కడుపునిండా భోజనం చేయగలుగుతారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.