: టీడీపీలో చేరుతున్నట్లు చంద్రబాబుకు తెలిపిన వైసీపీ నేత గంగుల ప్రతాప్ రెడ్డి
తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిపారు. ఈ రోజు టీడీపీ నేత అచ్చెన్నాయుడిని కలిసిన అనంతరం అమరావతిలోని సచివాలయంలో ఉన్న చంద్రబాబు నాయుడి వద్దకు ప్రతాప్ రెడ్డి బయలుదేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు నాయుడితో గంగుల ప్రతాప్ రెడ్డి, అచ్చెన్నాయుడు సమావేశమై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరుతున్నట్లు ప్రతాప్ రెడ్డి స్పష్టతనిచ్చారు. దీంతో నంద్యాలలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.