: మహిళలతో వ్యాయామం చేయించిన హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన.. మీరూ చూడండి!
సినీ నటుడు రామ్ చరణ్ భార్య, అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కామినేని.. కామారెడ్డి జిల్లా దోమకొండలో ట్రాన్స్‌ఫాం యువర్ సెల్ఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని రోజులుగా అక్కడి గ్రామీణ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తోన్న ఆమె.. ఈ రోజు దోమకొండలో మహిళలు, బాలికలకు వ్యాయామం నేర్పించారు. అనంతరం వారికి షూస్ పంచారు. ఆరోగ్యంతో పాటు మహిళా సాధికారత వంటి పలు అంశాలపై ఆమె అక్కడి మహిళలకు అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.