: మత్తు ఇంజక్షన్ తీసుకుని మెడికో ఆత్మహత్య!
నెల రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువతి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అనెస్తీషియా తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా ముథోల్‌లోని మహాలక్ష్మి కాలనీలో చోటు చేసుకుంది. ఆమె ఈ ఘటనకు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందన్న విషయం గురించి తెలియాల్సి ఉంది. దప్కల్ సవిత (26) అనే ఆ యువతి ఉస్మానియా మెడికల్ కళాశాలలో పీజీ చదువుతోంది. వరుస సెలవులు రావడంతో తన స్వగ్రామానికి వెళ్లింది.
నిన్న ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఆమె ఆ మత్తు ఇంజక్షన్ తీసుకుంది. పనుల నుంచి తిరిగివచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, సవిత అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.