: లాలూ ప్రసాద్ యాదవ్ కు మరో షాక్!
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు మరో షాక్ తగిలింది. ఆర్జేడీ కీలక నేతల్లో ఒకరైన ప్రగతి మెహతా సొంత పార్టీకి గుడ్ బై చెప్పి... నితీష్ కుమార్ పార్టీ జేడీయూలో చేరారు. లాలూతో పాటు ఆయన కుమారులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో, మహాకూటమితో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీతో కలసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, ఇప్పటికే గుర్రుగా ఉన్న లాలూకు ప్రగతి మెహతా పార్టీ ఫిరాయింపు మరింత ఇబ్బందిని కలిగిస్తోంది.