: మహిళా ఎంపీటీసీ భర్తపై కత్తులతో దాడి!
సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మహిళా ఎంపీటీసీ భర్త బత్తుల నాగరాజుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి దిగిన సంఘటన జరిగింది. ఈ సంఘటనలో నాగరాజు తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం హూజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. కాగా, భూ వివాదం నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడి కారణంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులను మోహరించారు.