: కుంతియా వచ్చి చెప్పినంత మాత్రాన ఇక్కడ ఒరిగేదేమీ లేదు: కోమటిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కుంతియా వచ్చి చెప్పినంత మాత్రాన ఇక్కడ ఒరిగేదేమీ లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జనాలకు దగ్గరగా ఉండే నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటారని చెప్పారు. త్వరలోనే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలుస్తానని తెలిపారు. నల్గొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యువ నాయకత్వంలో త్వరలోనే పార్టీ ముందుకు వెళుతుందని చెప్పారు.
ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. మూడున్నరేళ్లుగా భర్తీ చేయలేని ఉద్యోగాలను ఒక్క ఏడాదిలో ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. వెంటనే లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.