: జాతీయ గీతానికి గౌరవం ఇవ్వని కశ్మీర్ ప్రజలు... ఆలాపన సమయంలో చాలా మంది కూర్చునే ఉన్న వైనం!
జమ్మూ కాశ్మీర్ లోని, శ్రీనగర్లోని భక్షి స్టేడియంలో అధికారికంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ గీతాన్ని ప్రజలు అగౌరవపరిచారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత, జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో సాధారణ గ్యాలరీల్లో కూర్చున్న చాలా మంది కుర్చీలకే పరిమితమై కనిపించారు. వీఐపీ గ్యాలరీలో కూర్చున్న హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు నిల్చుని తమ దేశభక్తిని చాటుకున్నారు.
18,000 మంది కూర్చోగల సామర్థ్యం ఉన్న స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి కేవలం 3000 మంది హాజరయ్యారు. దీన్ని చూసి మొదటి సారి కశ్మీర్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల డ్యూటీకి వెళ్లిన ఉత్తరప్రదేశ్ పోలీసు బృందం ఆశ్చర్యపోయింది. తమ రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పండగలా జరుపుకుంటారని, కాశ్మీర్లో పరిస్థితి తమకు ఒకింత ఆశ్చర్యం, ఒకింత బాధ కలిగించాయని వారు అభిప్రాయపడ్డారు.