: ఆ పురుగే మహిళల జుట్టు కత్తిరిస్తోందంటున్న బీహార్ వాసులు.. వీడియో చూడండి!


ఢిల్లీ, గుడ్‌గావ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ముంబయితో పాటు పలు ప్రాంతాల్లో ఎవ‌రో మహిళల జుట్టు కత్తిరించి పారిపోతున్నార‌న్న వార్త‌లు షికార్లు చేసిన విష‌యం తెలిసిందే. ఓ ప్రాంతంలోనయితే మహిళలు తమ జుట్టును కాపాడుకునేందుకు హెల్మెట్లు పెట్టుకుని నిద్రపోతున్న ఫొటోలు వెలుగులోకొచ్చాయి. ఓ వృద్ధురాలే ఈ ప‌ని చేస్తోంద‌ని భావించిన కొంద‌రు ఓ ప్రాంతంలో దారుణానికి పాల్ప‌డ్డారు. ఓ వృద్ధురాలిని దారుణంగా కొట్టి చంపేశారు. అయితే, ఈ ఘ‌ట‌న‌ల‌కు కార‌ణం ఓ పురుగ‌ని బీహార్‌ వాసులు అంటున్నారు. పాట్నాలోని రామకృష్ణానగర్‌లో కొంత‌మంది ఓ వింతపురుగుని పట్టుకున్నారు. జుట్టును ఆ పురుగు నోటితో ఎలా కత్తిరిస్తోందో వీడియో తీసి చూపించారు. మహిళల జుట్టును ఇటువంటి పురుగులే క‌త్తిరిస్తు‌న్నాయని అంటున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి... 

  • Loading...

More Telugu News