: నంద్యాల ఉపఎన్నికల్లో మేము తటస్థం!: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టీకరణ
నంద్యాల ఉప ఎన్నికల్లో తాము తటస్థంగా ఉంటామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. తమ పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, ఎవరికో తాము మద్దతు ఇస్తున్నట్టు వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఈ సంద్భంగా ఆయన తెలిపారు. 2019 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళతామని, అప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ‘జనసేన’ మద్దతు ఉండదని స్పష్టం చేశారు. కాగా, నంద్యాల ఉపఎన్నికకు సంబంధించి ఏ పార్టీకి పవన్ మద్దతు ప్రకటిస్తారనే విషయమై ఇంతకాలం నెలకొన్న ఆసక్తికి తాజా ప్రకటనతో తెరపడినట్టయింది.