: నాకు కారు అవసరం లేదు... ఉండటానికి ఒక ఇల్లు ఇవ్వండి: ప్రభుత్వానికి విన్నవించిన మహిళా క్రికెటర్


మహిళల క్రికెట్ ప్రపంచకప్ లో భారత జట్టు ఫైనల్స్ వరకు వెళ్లి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జట్టులోని పలువురు క్రీడాకారులకు బహుమతులు అందుతున్నాయి. తెలుగు అమ్మాయి అయిన కెప్టెన్ మిథాలీరాజ్ కు చాముండేశ్వరినాథ్ బీఎండబ్ల్యూ కారును బహూకరించిన సంగతి తెలిసిందే.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కర్ణాటకకు చెందిన మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ ను ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా ఆమెకు కర్ణాటక రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ రూ.5 లక్షల విలువైన కారును బహూకరించబోయారు. అయితే, ఆ బహుమతిని ఆమె సున్నితంగా తిరస్కరించారు. తమ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో, కారు తమకు అక్కర్లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం ఉండటానికి ఇల్లు లేక తన కుటుంబం చాలా ఇబ్బంది పడుతోందని... తాను తన తల్లి, చెల్లి, సోదరులతో కలసి ఉండటానికి ఇల్లు కావాలని కోరింది. ఈ సందర్భంగా ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.  

  • Loading...

More Telugu News