: మేము చూస్తూ ఊరుకోం: తమ దేశంపై విచారణకు ఆదేశించడంతో అమెరికాను హెచ్చరించిన చైనా


తమ దేశ మేధోసంపత్తిని తస్కరించిందన్న ఆరోప‌ణ‌ల‌తో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దర్యాప్తునకు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఆ ప‌నిచేస్తే అమెరికాకే న‌ష్టం అంటూ అంత‌కు ముందు వ్యాఖ్య‌లు చేసిన చైనా... తాజాగా మ‌రోసారి స్పందించింది. పరస్పర వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని చైనా హెచ్చ‌రించింది. ఇందుకు సంబంధించి చైనా వాణిజ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

తమ దేశ చట్టబద్దమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునేందుకు తాము ఈ విష‌యంపై అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామని తేల్చి చెప్పింది. మ‌రోవైపు అమెరికా అధ్య‌క్షుడు తమ దేశస్థుల ఉద్యోగాలు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలను కాపాడుకోవ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఇంత‌కు ముందే స్ప‌ష్టం చేశారు. 

  • Loading...

More Telugu News