: జాతి, లింగం ఆధారంగానే కంపెనీ ఉద్యోగులను ఎంచుకుంటుంది: గూగుల్ మాజీ ఉద్యోగి
ఉద్యోగులను ఎంచుకోవడంలో టెక్ దిగ్గజం గూగుల్ తీవ్ర వివక్షను పాటిస్తుందని, జాతి, లింగం ఆధారంగానే ఉద్యోగాలను ఇస్తుందని ఇటీవల గూగుల్ తొలగించిన ఇంజినీర్ జేమ్స్ దామోర్ తెలిపాడు. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించాడు. `అమ్మాయిలు టెకీలుగా పనికిరారు` అంటూ ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలను తప్పు బట్టి జేమ్స్ దామోర్‌ను గూగుల్ ఉద్యోగం నుంచి తొలగించింది. అలాగే తనను అన్యాయంగా తొలగించిన విషయంపై చట్టపరంగా తేల్చుకుంటానని ఆయన చెప్పాడు. అంతేకాకుండా గూగుల్ ఉద్యోగులకు కల్పించే సౌకర్యాల వల్ల కంపెనీలో కొనసాగుతున్న లోటుపాట్ల గురించి ఎవరూ బయటికి చెప్పేందుకు ఆసక్తి చూపించరని, అక్కడి ఉద్యోగులు ఎవరికి వాళ్లు తమను తాము గొప్ప సాధువులుగా భావిస్తారని దామోర్ చెప్పుకొచ్చాడు.