: త్వరలో దుబాయ్ లో `ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ`!
భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో ధోనీ కూడా త్వరలో తన పేరుతో ఓ క్రికెట్ అకాడమీని ప్రారంభించబోతున్నాడు. దుబాయ్ పసిఫిక్ స్పోర్ట్స్ క్లబ్ (పీఎస్సీ)తో కలిసి దుబాయ్‌లోనే ఈ క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆ అకాడమీకి `ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ` అని పేరు పెట్టనున్నట్లు పీఎస్సీ ప్రతినిధి పర్వేజ్ ఖాన్ తెలిపారు.
ధోనీ అప్పుడప్పుడు తాము ఏర్పాటు చేయనున్న అకాడమీని సందర్శిస్తారని, అలాగే ఈ అకాడమీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉంటాడని పర్వేజ్ చెప్పారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాలని తాము అనుకున్నట్లు, అందుకు ధోనీ కూడా సుముఖత వ్యక్తం చేశారని ఆయన వివరించారు. పీఎస్సీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు ఆనందంగా ఉందని, అకాడమీ కోసం తన వీలైనంత కృషి చేస్తానని మహేంద్ర సింగ్ ధోనీ పేర్కొన్నాడు.