: జియో ఫోన్ నుంచి మరో శుభవార్త.. మూడు సంవత్సరాల కంటే ముందే వినియోగదారుడి చేతికి సెక్యూరిటీ డిపాజిట్!
దాదాపు ఉచితమే అంటూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని ప్రకటించిన జియో 4జీ ఫీచర్ మొబైల్ ఫోన్లు త్వరలోనే వినియోగదారులకు అందనున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ కావాలంటే తొలుత రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల తరువాత ఆ రూ.1500ను రిలయన్స్ తిరిగి ఇచ్చేస్తుంది. అయితే, ఓ జాతీయ దినపత్రిక నివేదిక ప్రకారం జియో ఫోన్ కోసం ఇచ్చిన ఆ సెక్యూరిటీ డిపాజిట్లను వినియోగదారులకు రిలయన్స్ మూడు సంవత్సరాల కంటే ముందే చెల్లించాలని భావిస్తోంది. ఇప్పటికే పలు రిలయన్స్ రిటైల్ దుకాణాల్లో ప్రారంభమైన ఈ ఫోన్ల బుకింగ్‌లు ఈ నెల 24 నుంచి మై జియో యాప్‌లోనూ ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్లకు ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సిందే.