: 'సాహో' కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ రూ. 30 కోట్లు!
రాజమౌళి చిత్రరాజం 'బాహుబలి' రెండు భాగాలతో భారత సినీ చరిత్రలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం 'సాహో'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ తన రెమ్యునరేషన్ గా రూ. 30 కోట్లు తీసుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో తయారవుతున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇక ప్రభాస్ రూ. 30 కోట్లు తీసుకుంటున్న విషయం నిజమే అయితే, అంత పారితోషికం తీసుకున్న తొలి తెలుగు హీరోగా కూడా ప్రభాస్ నిలుస్తాడు.