: వినాయక పూజను 'ఈజీ' చేసిన యువ టెక్కీ... ఒక్క క్లిక్ తో ఆల్-ఇన్-వన్ కిట్ మీ ఇంటికి!
అన్ని విఘ్నాలు తొలగిపోవాలంటూ గణనాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ, వినాయకచవితిని ఘనంగా చేసుకుంటుంటాం. అయితే, వినాయకుడి పూజకు అవసరమైన పూజా సామాగ్రి, పత్రిని సేకరించడం అంత సులువైన పని కాదు. అసలు పూజకోసం ఏయే రకాల పత్రిని సేకరించాలో కూడా మనలో చాలా మందికి తెలియదు. గణపతి పూజకు వినియోగించే పత్రులు ఇవేనంటూ రోడ్ల పక్కన రకరకాలు ఆకులు అమ్ముతుంటారు. మనం కూడా రెండో ఆలోచన లేకుండా, వాళ్లడిగినంత సొమ్ము ఇచ్చేసి వాటిని ఇంటికి తీసుకొచ్చి, పూజ చేసేస్తాం.
ఇప్పుడు ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టింది 'ఆరాధ్య' అనే ఆన్ లైన్ కంపెనీ. వినాయకుడి పూజకు అవసరమైన మట్టి వినాయకుడితో పాటు, 18 రకాల పూజా సామాగ్రి, 21 రకాల ముఖ్యమైన పత్రులను ఓ ప్యాక్ ద్వారా భక్తులకు అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ వెసులుబాటు హైదరాబాద్ వాసులకు మాత్రమే అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది ఇరు తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని ప్రాంతాలకు తమ సేవలను విస్తరించనుంది.
ఈ పూజా కిట్ ను పొందాలంటే www.aaradhyakit.com వెబ్ సైట్లోకి లాగిన్ అయి కిట్ ను బుక్ చేసుకోవచ్చు. లేదా 9494563839 వాట్సాప్ నంబరును సంప్రదించవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కింద ఉన్న వీడియోలో చూడండి.
భక్తులకు వినాయకుడి కిట్ ను అందించాలనే ఆలోచన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మదిలో మొలకెత్తింది. పూజా సామాగ్రి కోసం, పత్రి కోసం భక్తులు పడుతున్న ఇబ్బందే, ఆయనను ఈ దిశగా అడుగులు వేసేలా చేసింది. చివరకు 'ఆరాధ్య' పేరుతో సంస్థను ప్రారంభించి... భక్తులకు అవసరమైన అన్నింటినీ ఒకే కిట్ ద్వారా అందించేందుకు ప్రేరేపించింది. వినాయకుడి తోపాటు, ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఈకో ఫ్రెండ్లీ అయివుండటం గమనార్హం.