: హార్వర్డ్ యూనివర్సిటీలో రామాయణ, మహాభారత పాఠాలు
రానున్న విద్యా కాలం నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు రామాయణ, మహాభారత పాఠాలు బోధించనున్నారు. `ఇతిహాసాల నుంచి భారత మత విధానాలు` అనే అంశం నేర్పడం కోసం ఈ పురాణ గ్రంథాలను సిలబస్ లో చేర్చినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకురాలు యానీ ఈ. మోనియస్ తెలిపారు. ఈమె హార్వర్డ్‌లో దక్షిణాసియా మతాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. రామాయణ, మహాభారత ఇతిహాసాల్లో శ్లోకాల రూపంలో వర్ణించిన మత పరిస్థితులను ఈ సిలబస్‌లో చేర్చారు. వ్యాసుడు, వాల్మీకి చెప్పిన విషయాలను ఆధునిక మత పరిస్థితులకు అనుసంధానించి ఈ పాఠాల ద్వారా విద్యార్థులకు బోధించనున్నారు. భూమ్మీద మానవుడు జీవించడానికి అన్ని రకాల మార్గదర్శకాలను ఈ రెండు గ్రంథాలు చూపించాయని, వీటిని బోధించడం వల్ల విద్యార్థులు చాలా నేర్చుకుంటారని యానీ అన్నారు.