: టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుకు చేదు అనుభవం!


ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుకు చేదు అనుభవం ఎదురైంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మార్క్ ఫెడ్ లో జరిగిన పసుపు కుంభకోణం ఆయనను వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆయన జడదేవి గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీగంగమ్మతల్లి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయనను స్థానికులు కొందరు నిలదీశారు. కుంభకోణానికి పాల్పడ్డవారికి మద్దతు ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డవారిని పార్టీ నుంచి బహిష్కరించాలని వారు నినాదాలు చేశారు. అక్కడున్న నాయకులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, వారు వినలేదు. ఈ నేపథ్యంలో, తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

  • Loading...

More Telugu News