: విమానం నుంచి పడ్డా చెక్కు చెదరని శాంసంగ్ ఫోన్... వీడియో చూడండి!


చేతిలోంచి జారి పడిన వెంటనే పగిలే స్మార్ట్ ఫోన్, కొన్ని వేల అడుగుల ఎత్తునుంచి పడినప్పటికీ, ఏ మాత్రం చెక్కు చెదరలేదని తెలిపే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ చిన్న విమానంలో యూఎస్ లోని టెన్నెస్సీ ప్రాంతానికి చెందిన బ్లేక్ హెండర్స్ న్ ప్రయాణిస్తున్నాడు. ఆ సమీపంలో మరో పెద్ద విమానం అత్యంత సమీపంలోకి దూసుకు వచ్చింది. దీన్ని వీడియో తీద్దామని అనుకున్న బ్లేక్, తన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్ ను బయటకు తీశాడు. ఆ సమయంలో చేతిలోంచి మొబైల్ జారిపోయింది.

 అంతఎత్తు నుంచి కిందకు పడుతూ కూడా వీడియో తీసింది. ఓ ఇంట్లోని పెరడులో ఆ ఫోన్ పడింది. ఆ తరువాత కూడా వీడియో తీస్తూనే ఉంది. ఆ ఇంట్లోవారు ఫోన్ పడటాన్ని గమనించి, దాన్ని తీసుకుని పరిశీలిస్తున్న దృశ్యాలూ రికార్డయ్యాయి. ఫోన్ లోని జీపీఎస్ సాయంతో తన మొబైల్ ఎక్కడుందన్న విషయాన్ని బ్లేక్ కనుగొని ఫోన్ ను తిరిగి పొందాడు. అంత ఎత్తునుండి పడినా ఫోన్ పై ఎలాంటి డ్యామేజీ లేకపోగా, చిన్నగీతలు కూడా పడలేదట. ఈ వీడియోను యూ ట్యూబ్ లో పోస్టు చేయగా, అదిప్పుడు ఎంతో వైరల్. దాన్ని మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News