: ఒబామా ట్వీట్... లైకుల్లో రికార్డు బ్రేక్!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆగస్టు 13న చేసిన ట్వీట్‌పై లైకుల వర్షం కురిసింది. ట్విట్టర్ మాధ్యమంలో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ లైకులు వచ్చిన ట్వీట్‌గా ఒబామా ట్వీట్ నిలిచింది. దక్షిణాఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలా చెప్పిన సూక్తిని వర్జీనియాలో జరిగిన ఓ ర్యాలీ సందర్భంగా ఒబామా ట్వీట్ చేశారు. దీనికి 28,79, 304 లైకులు వచ్చాయి. నెల్సన్ మండేలా ఆటోబయోగ్రఫీ `ఎ లాంగ్‌వాక్ టూ ఫ్రీడం`లో ఓ వాక్యంతో పాటు 2011లో తాను సందర్శించిన ఆశ్రమంలో వివిధ జాతుల పిల్లలతో దిగిన ఫొటోను ఒబామా షేర్ చేశారు. మూడు భాగాలుగా చేసిన ఈ ట్వీట్‌కు లక్షల్లో లైకులు వచ్చాయి. అంతే స్థాయిలో రీట్వీట్లు కూడా అయ్యాయి. గతంలో పాప్ సింగర్ అరియానా గ్రాండే మాంచెస్టర్‌లోని తన కాన్సర్ట్‌లో బాంబు అలజడి గురించి చేసిన ట్వీట్‌కు 27 లక్షల లైకులు వచ్చాయి. ఈ రికార్డును ఒబామా ట్వీట్ బ్రేక్ చేసింది.