: దిలీప్ కుమార్‌ను పరామర్శించిన షారుక్ ఖాన్
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అలనాటి బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్‌ను బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ పరామర్శించాడు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న దిలీప్ కుమార్‌ను షారుక్ పరామర్శించాడు. ఈ విషయాన్ని దిలీప్ భార్య సైరా భాను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. షారుక్, దిలీప్ నుదుటిపై ప్రేమగా ముద్దుపెడుతున్న ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. అలాగే ప్రస్తుతం దిలీప్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె తెలియజేశారు.