: ఇలాగైతే చైనా నిండా మునగడం ఖాయం: ఐఎంఎఫ్
అప్పుల ఊబిలో చైనా కూరుకుపోతోందని... ఆ దేశ అప్పుల భారం తార స్థాయికి చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. అప్పుల మీద అప్పులు చేస్తూ, ఆర్థిక వ్యవస్థను నడిపించాలనుకోవాలనుకుంటే... జీడీపీ వృద్ధి రేటు భారీగా పతనమవుతుందని, పుట్టి మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒక వేళ అదే గనుక జరిగితే చైనా తీవ్ర ఆటుపోట్లకు గురవుతుందని చెప్పింది. గత ఏడాది చైనా జీడీపీలో అప్పుల భారం 235 శాతంగా ఉందని... 2022 నాటికి 290 శాతానికి చేరుకుంటుందని హెచ్చరించింది. నిర్మాణాత్మక సంస్కరణలతో దానికి వెంటనే అడ్డుకట్ట వేయాలని సూచించింది.