: టీఆర్ఎస్ లోకి దిల్ రాజు.. నిజామాబాద్ ఎంపీ సీటు ఆఫర్?


ప్రముఖ నిర్మాత దిల్ రాజును తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి స్వయంగా కేసీఆర్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత, రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నందున ఆమె సీటును దిల్ రాజుకు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. పార్టీకి సినీ గ్లామర్ ను అద్దే ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని దిల్ రాజుకు ఆఫర్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ఆహ్వానంపై దిల్ రాజు సైతం కొంత పాజిటివ్ గానే స్పందించినట్టు తెలిసింది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, 2019 ఎన్నికల్లో దిల్ రాజు టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగడం ఖాయమని పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో దిల్ రాజు స్పందన ఏంటన్నది అధికారికంగా తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News