: కేసీఆర్ వార్నింగ్ తో డ్రస్సింగ్ స్టయిల్ మార్చిన కలెక్టర్ ఆమ్రపాలి!


అత్యధికంగా వెస్ట్రన్ స్టయిల్ డ్రస్సులను ధరించే తెలంగాణ కలెక్టర్ ఆమ్రపాలి, 71వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ, తన డ్రస్సింగ్ స్టయిల్ ను మార్చారు. ఇటీవల రాష్ట్ర అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్, అధికారులు దుస్తులు, ముఖ్యంగా మహిళా అధికారులు ధరిస్తున్న దుస్తుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

జీన్స్, టీషర్టులను కలెక్టర్ల వంటి వారు వేసుకుంటే, వారంటే ప్రజల్లో గౌరవం తగ్గుతోందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు మిగతా ఎవరి గురించీ కాదని, వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి గురించేనని అధికారులంతా గుసగుసలాడుకున్నారు కూడా. ఆమె ఆధునిక పోకడలను తగ్గించాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారని అన్నారు. ఇక, నిన్నటి వేడుకల్లో పొడవు చేతులతో నిండుగా చీరకట్టుతో హాజరైన ఆమె, మీడియా ముందుకు మాత్రం రాకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News