: మంత్రి అఖిలప్రియకు సవాల్ విసిరిన శిల్పా చక్రపాణి రెడ్డి!


తాను రాజీనామా చేసి, తన అన్న కోసం ఓట్లను అడుగుతున్నానని, దమ్ముంటే, భూమా అఖిలప్రియ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తన సోదరుడి కోసం ఓట్లను అడగాలని మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. తన రాజీనామాతో వైసీపీకి నైతిక విలువ పెరిగిందని అభిప్రాయపడ్డ ఆయన, తన కుటుంబం ఆది నుంచి విలువలకు కట్టుబడి వుందని అన్నారు.

వైకాపా టికెట్ పై గెలిచి, ఆపై టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా, ధైర్యముంటే రాజీనామాలు చేసి, వాటిని ఆమోదింపజేసుకోవాలని డిమాండ్ చేసిన శిల్పా, తెలుగుదేశం నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు తన రాజీనామాతో సరైన సమాధానం చెప్పానని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేది తన అన్న శిల్పా మోహన్ రెడ్డేనని తెలిపారు.

  • Loading...

More Telugu News