: సెలవుల్లో ఇంటికి వస్తున్న ఆర్మీ అధికారికి భార్య ఇచ్చిన సర్ ప్రైజ్... వీడియో చూడండి


కుటుంబానికి దూరంగా దేశసేవలో తరించే ఆర్మీ అధికారికి భార్య సర్ ప్రైజ్ ఇచ్చింది. దాని వివరాల్లోకి వెళ్తే...శివేష్‌ తివారీ అనంత్‌ నాగ్‌ లో 42వ బెటాలియన్‌ లో మేజర్ గా పని చేస్తున్నారు. గతంలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన ఆయన రెండు సార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చారు. ఆయన సేవలను మెచ్చిన భారత ప్రభుత్వం 2017లో సేనా మెడల్‌ తో సత్కరించింది. కొన్ని నెలలుగా భార్య, కుటుంబానికి దూరంగా ఉన్న ఆయన సెలవులకు ఇంటికెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన భార్య ఆయనకు వినూత్నంగా ఘన స్వాగతం ఏర్పాటు చేసింది. ఎయిర్‌ పోర్ట్‌ లో ఇద్దరు యువకుల చేత ‘రంగ్‌ దే బసంతి’ పాటకు డ్యాన్స్‌ చేయిస్తూ కుటుంబ సభ్యులతో ప్లకార్డులు ప్రదర్శించింది. వాటిలో ‘అతని కళ్లు గోధుమ రంగులో ఉంటాయి. బూట్లు నల్లగా ఉంటాయి. అందరూ పక్కకు తప్పుకోండి. నా భర్త వస్తున్నారు’ అని పేర్కొంది. దానిని చూసిన శివేష్ ఆశ్చర్యానందాలతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. అందరూ ఆ జంటను దీవిస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి. 

  • Loading...

More Telugu News