: మరో ఐదడుగులు తవ్వితే చాలు.. బాలుడిని బోరుబావి నుంచి బయటకు తీసేయచ్చు!


గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మిడివరంలో రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే సహాయక చర్యల్లో దిగిన గ్రామీణులు, రెవెన్యూ సిబ్బందికి తోడుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జత కలిశారు. అప్పటికే 15 అడుగుల లోతులో చంద్రశేఖర్ పడినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చేసరికే ప్రొక్లెయినర్ తో రెవెన్యూ అధికారులు 15 అడుగుల గోతిని తవ్వేశారు. మరో ఐదు అడుగుల గోతిని తవ్వితే దానిని బోరుబావికి అనుసంధానం చేయచ్చు. ఆ తరువాత బాలుడ్ని బయటకు తీయడానికి అవకాశం వుంటుంది. ఇప్పటికే ప్రత్యేక వైద్య సిబ్బందితో 108 అక్కడికి చేరుకుంది. 

  • Loading...

More Telugu News