: నా ప్రమేయం లేకుండానే ఆ నీలిచిత్రం అప్ లోడ్ అయింది: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కిలారి మనోహర్
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కి చెందిన కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్ లో కార్పొరేటర్ కిలారి మనోహర్ నీలిచిత్రం (బ్లూ ఫిల్మ్) పోస్ట్ చేయడం వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇన్నాళ్లకు ఆయన వివరణ ఇచ్చారు. స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నా ప్రమేయం లేకుండా వాట్స్ యాప్ గ్రూప్ లో విజువల్ అప్ లోడ్ అయ్యింది" అన్నారు. దీనిపై బహిరంగ క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. జూలై 31న విజువల్ అప్ లోడ్ అయితే దానికి కావాలని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, దీనిపై మహిళా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.