: చైనా మాటలు తేనె పూసిన కత్తులు...దానిని ఉపేక్షించకండి: గువాం గవర్నర్
చైనా మాటలు తేనె పూసిన కత్తులని అమెరికా అధీనంలోని గువాం దీవి గవర్నర్ ఎడీ బజా కాల్వోతో అన్నారు. ఉత్తరకొరియా గువాం దీవిపై దాడి చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షల నేపథ్యంలో ఉత్తరకొరియా కుదేలైపోయిందని ఆయన చెప్పారు. అంతే కాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఫోన్ చేసి 'మీ రక్షణకు నాది భరోసా. వెయ్యిశాతం మీరు సురక్షితంగా ఉంటారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇది నేను మీకిస్తున్న మాట' అని చెప్పారని ఆయన తెలిపారు.
ఉత్తరకొరియా న్యూక్లియర్ మిసైల్స్ ప్రయోగించినా వాటిని నిర్వీర్యం చేయగల సామర్థ్యం తమ వద్ద ఉందని ఆయన చెప్పారని అన్నారు. ఉత్తరకొరియాకు సహకరిస్తున్న చైనా బ్యాంకులను అమెరికాలో రద్దు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ కు ఆయన సూచించారు. అమెరికాలో కార్యకలాపాలు కొనసాగిస్తూ పరోక్షంగా ఉత్తరకొరియాకు మేలు చేసేలా చైనా బ్యాంకులు వ్యవహరిస్తున్నాయని ఆరోపించిన ఆయన, వాటి కార్యకలాపాలు కూడా నిలిపేస్తే ఉత్తరకొరియా కాళ్లబేరానికి వస్తుందని ఆయన ధీమాగా చెప్పారు.