: స్వాతంత్ర్య దినోత్సవం రోజున బాలికపై అత్యాచారం!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశమంతటా జరుగుతున్న వేళ ఓ అమ్మాయి జీవితాన్ని కామాంధుడు కాటేశాడు. 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉదయమే స్కూల్ కు వెళ్లి, తిరిగి ఇంటికి వస్తున్న 8వ తరగతి చదువుతున్న బాలికను 40 ఏళ్ల వ్యక్తి చండీగడ్ లోని బిజీ రోడ్డు, సెక్టార్ 23లోని చిల్డ్రన్స్ పార్క్ లో కిడ్నాప్ చేసి, పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరానికి ఎత్తుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.