: తిరుపతి నుంచి రాజమహేంద్రవరం చేరుకున్న సీఎం చంద్రబాబు
నేడు తిరుపతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఆపై పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఏపీ సీఎం చంద్రబాబు, కొద్దిసేపటి క్రితం రాజమహేంద్రవరం చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ప్రాజెక్టుకు అమర్చిన నీటి తరలింపు మోటార్లను స్విచ్చాన్ చేయడం ద్వారా పొలాలకు నీటిని ఆయన విడుదల చేయనున్నారు. పోలవరం ఎడమవైపు ప్రధాన కాలువ వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. నీటి విడుదల అనంతరం జగ్గంపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగిస్తారు.