: చుట్టూ వరద నీళ్లు... చెక్కు చెదరని దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం... ఫోటో చూడండి!



అసోం... గత నాలుగైదు రోజులుగా బ్రహ్మపుత్ర నది విశ్వరూపం చూపుతుంటే అల్లాడుతున్న రాష్ట్రం. చుట్టూ వరద పారుతున్నా, అక్కడి చిన్నారుల మనసుల్లో దేశభక్తి మాత్రం తగ్గలేదు. పడవలపైనే నిలబడి, పడవలకే కర్రలు కట్టి, జాతీయ పతాకాన్ని ఎగురవేసి తమలోని స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటారు. ఈ చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కొన్ని చోట్ల ఇంటి పైకప్పుల మీదే జెండాలను ఎగురవేయగా, చాలా చోట్ల పడవలే వేదికలయ్యాయి. తమలోని జాతీయతా స్ఫూర్తి ఎంతమాత్రమూ తగ్గలేదని అసోం ప్రజలు చాటి చెబుతున్న ఈ చిత్రాలను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News