: ‘హ్యాపీ ఇండిపెండెన్స్’ చెప్పిన షాహిద్ అఫ్రిది!
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది శుభాకాంక్షలు తెలిపాడు. భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని, శాంతి, సహజీవనం, ప్రేమ కోసం ఇరుదేశాలు కలిసి ముందుకు సాగాలని, మానవతా విలువల్ని కాపాడాలని, తన ఆశ వమ్ము కాదని ఆశిస్తున్నానని తన ట్వీట్ లో ఆకాంక్షించాడు. కాగా, క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం, ఆఫ్రిది క్రికెట్ ఫౌండేషన్ ను నెలకొల్పి స్థానిక యువతకు క్రికెట్ పాఠాలు నేర్పుతున్నాడు. ఈ ఫౌండేషన్ కు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సంతకంతో ఉన్న బ్యాట్ ను విరాళంగా ఇచ్చాడు. ఇందుకు, అఫ్రిది తన ధన్యవాదాలు తెలిపాడు.