: ధోనీ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ... మిగిలిందిక సౌరవ్ గంగూలీ!
శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో 3-0 విజయంతో తొలిసారిగా విదేశీ గడ్డపై క్లీన్ స్వీప్ సాధించిన ఘనతను సొంతం చేసుకున్న జట్టుకు కెప్టెన్ గా నిలిచిన విరాట్ కోహ్లీ, మరో రికార్డునూ బద్దలు కొట్టాడు. విదేశాల్లో అత్యధిక టెస్టు మ్యాచ్ లను నెగ్గిన రెండో భారత కెప్టెన్ గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఇంతవరకూ ఆరు టెస్టు మ్యాచ్ లలో విజయాలు సాధించగా, కోహ్లీ ఖాతాలో ఏడు విజయాలు వచ్చి చేరాయి.
ఇక భారత్ తరఫున అత్యధిక విజయాలు సౌరవ్ గంగూలీ పేరిట ఉన్నాయన్న సంగతి తెలిసిందే. గంగూలీ తన కెరీర్ లో 11 టెస్టు విజయాలు నమోదు చేసి వున్నాడు. కాగా, కోహ్లీ ఇప్పటివరకూ 29 టెస్టు మ్యాచ్ లలోనే 7 విదేశీ విజయాలను సాధించాడు. అదే ధోనీ 6 విజయాలకు 60 టెస్టు మ్యాచ్ లు అవసరం అయ్యాయి. ఇక గంగూలీ 49 మ్యాచ్ లలోనే 11 విజయాలు నమోదు చేశాడు. గంగూలీ రికార్డును కోహ్లీ వచ్చే ఏడాదిలోగా బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన్నది క్రీడా పండితుల అభిప్రాయం.