: స్వాతంత్ర్య వేడుకల్లో ప్రసంగిస్తుండగా ఒడిశా సీఎంకు అస్వస్థత


స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నిర్వహించిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జెండావిష్కరణ అనంతరం ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే స్పందించిన సిబ్బంది నవీన్ పట్నాయక్ కు వైద్య చికిత్స అందించారు. ఈ విషయాన్ని మీడియాకు ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. సముద్ర తీర ప్రాంతం కావడంతో వాతావరణం వేడిగా ఉండటం, ఉక్కబోత వాతావరణం కారణంగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆయా కార్యక్రమాల్లో నవీన్ పట్నాయక్ పాల్గొంటారని తెలిపింది.  

  • Loading...

More Telugu News